కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) వర్చువల్‌గా సమావేశమై చర్చించింది. కొవిడ్‌పై పోరులో ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచనారాహిత్యం, సంసిద్ధంగా లేని కారణంగా.. దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విచారం వ్యక్తం చేసింది. సరైన సమయంలో అత్యవసరమైన చర్యలు తీసుకోని పక్షంలో.. దేశం అసాధారణ విపత్తును ఎదుర్కొవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
'తగిన చర్యలు చేపట్టకపోతే.. అసాధారణ విపత్తే' - సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయాలు
కొవిడ్‌పై పోరులో ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచనరాహిత్యం కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. మహమ్మారిని కట్టడి చేయటంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం వర్చువల్‌గా సమావేశమై చర్చించింది.
!['తగిన చర్యలు చేపట్టకపోతే.. అసాధారణ విపత్తే' congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11441103-thumbnail-3x2-111.jpg)
కరోనాపై సీడబ్ల్యూసీ చర్చ
మరోవైపు.. సీడబ్ల్యూసీ భేటీలో కొవిడ్ కట్టడికై వెల్లడైన అభిప్రాయాలు, సూచనలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ ద్వారా.. సలహాలు ప్రధానికి పంపుతామని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వెల్లడించారు. దిల్లీలో ఉండి.. కరోనా నియంత్రణపై చర్చలు జరపకుండా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని విమర్శించారు. మోదీ చర్యను తీవ్రమైన నిర్లక్ష్యంగా అభివర్ణించారు. ప్రధానిగా మోదీ తన బాధ్యతను నిర్వర్తించాలన్నారు.
ఇదీ చూడండి:ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు!