curfew in rajasthan: రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహన ర్యాలీపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడిన క్రమంలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది మతపరమై ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. సుమారు 600 మంది అదనపు బలగాలు, 50 మంది పోలీసు ఉన్నతాధికారులను మోహరించారు.
communal tension: హిందూ క్యాలెండర్ ప్రకారం శనివారం కొత్త ఏడాది ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొందరు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ముస్లిం ప్రభావిత ప్రాంతం నుంచి వెళ్తున్న క్రమంలోనే వారిపై దుండగుల రాళ్ల దాడి జరిగింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
"నగరంలో కర్ఫ్యూ విధించాం. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అదనపు బలగాలను మోహరించాం. నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా అదుపులోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలను దగ్ధం చేశారు. ఈ ఘటనల్లో 35 మందికిపైగా గాయపడ్డారు. అందులో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల జైపుర్‌కు తరలించారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. బైక్ ర్యాలీ ముస్లిం ప్రభావిత ప్రాంతం నుంచి వెళ్లింది. వారిపై కొందరు దుండుగులు రాళ్లు విసిరారు. అది మతపరమైన ఉద్రిక్తతకు దారి తీసింది."