తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CSL Engineering Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. కొచ్చిన్ షిప్​యార్డ్​లో 145 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

CSL Engineering Jobs 2023 In Telugu : డిగ్రీ, డిప్లొమాలు చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. కొచ్చిన్​ షిప్​యార్డ్ లిమిటెడ్​​ 145 గ్రాడ్యుయేట్​, టెక్నీషియన్ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

CSL Recruitment 2023
CSL Engineering Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 10:58 AM IST

CSL Engineering Jobs 2023 : మినీరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్​ షిప్​యార్డ్​ లిమిటెడ్​ (CSL) 145 గ్రాడ్యుయేట్​, టెక్నీషియన్​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేటగిరీ - 1 గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్​ పోస్టుల వివరాలు

  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్​ ఇంజినీర్​​ - 12
  • మెకానికల్​ ఇంజినీర్​​ - 20
  • ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యునికేషన్​ ఇంజినీర్​ - 6
  • సివిల్ ఇంజినీర్​ - 15
  • కంప్యూటర్​ సైన్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ - 10
  • ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీర్​​ - 4
  • మెరైన్​ ఇంజినీర్​ - 4
  • నేవల్ ఆర్కిటెక్చర్​ అండ్ షిప్​బిల్డింగ్​ - 4
  • మొత్తం గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్​ పోస్టులు - 75

కేటగిరీ -2 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్​ పోస్టుల వివరాలు

  • ఎలక్ట్రికల్ ఇంజినీర్​​ - 14
  • మెకానికల్ ఇంజినీర్​​ - 19
  • ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్​ - 8
  • ఇన్​స్ట్రుమెంటేషన్​ టెక్నాలజీ - 4
  • సివిల్ ఇంజినీర్​ - 10
  • కంప్యూటర్​ ఇంజినీర్​ - 5
  • కమర్షియల్ ప్రాక్టీస్​ - 10
  • మొత్తం టెక్నీషియన్​ (డిప్లొమా) అప్రెంటీస్​ పోస్టులు - 70

విద్యార్హతలు
CSL Apprentice Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్​ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
CSL Engineering Graduate Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం
CSL Apprentice Selection Process :అకడమిక్​ స్టడీస్​లో మంచి మెరిట్ వచ్చిన అభ్యర్థులను ముందుగా షార్ట్​లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.

స్టైపెండ్​
CSL Apprentice Salary :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​లకు నెలకు రూ.12,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్​లకు నెలకు రూ.10,200 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.

దరఖాస్తు విధానం
CSL Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://nats.education.gov.in వెబ్​సైట్​ను ఓపెన్ చేసి, మీ ఎలిజిబిలిటీని చెక్​ చేసుకోవాలి. తరువాత..
  • ఇదే పోర్టల్​లో 'స్టూడెంట్ రిజిస్టర్​'లో మీ పేరును నమోదు చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసి సబ్మిట్​ చేయాలి.
  • వెంటనే ఒక యూనిక్​ ఎన్​రోల్​మెంట్​ నంబర్ జనరేట్​ అవుతుంది. దానిని మీరు జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి.
  • ఈ ఎన్​రోల్​మెంట్ నంబర్​తో మరోసారి పోర్టల్​లో లాగిన్ అవ్వాలి.
  • అక్కడ మీకు కొచ్చిన్​ షిప్​యార్డ్ లిమిటెడ్​ అప్లై లింక్​ కనిపిస్తుంది.
  • ఈ లింక్​పై క్లిక్​ చేసి, దరఖాస్తు ఫారాన్ని నింపి, సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్​ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్​ ఫారాన్ని డౌన్లోడ్​ చేసి, భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
CSL Apprentice Recruitment Apply Late Date:

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్​ 11
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 అక్టోబర్​ 31

CNP ITI Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. కరెన్సీ నోట్​ ప్రెస్​లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

AAICLAS Assistant Security Jobs : ఇంటర్​ అర్హతతో.. AAICLASలో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details