తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను గుర్తించేలా పార్లమెంట్​లో నిఘా వ్యవస్థలు! - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్

కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించేలా పార్లమెంట్​లో నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు.. సీఎస్ఐఆర్ సూచించింది. వాయు, మురుగునీటి నిఘా వ్యవస్థల ద్వారా కరోనా ఎంత మందికి సోకిందనే విషయంపై అవగాహనకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు వెంకయ్యకు ఓ ప్రెసెంటేషన్ ఇచ్చింది.

CSIR Parliament surveillance systems
కరోనాను గుర్తించేలా పార్లమెంట్​లో నిఘా వ్యవస్థలు!

By

Published : Mar 30, 2021, 2:24 PM IST

కరోనాను గుర్తించేలా పార్లమెంట్​లో వాయు, మురుగునీటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్'(సీఎస్ఐఆర్) సూచించింది. ఇందుకు సంబంధించి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ముందు ఓ ప్రెసెంటేషన్ ఇచ్చింది.

మురుగునీటి నిఘా వ్యవస్థ ద్వారా ఎంత మందికి కరోనా సోకిందనే విషయంపై ఓ అవగాహనకు రావొచ్చని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సీ మండే పేర్కొన్నారు. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానప్పుడు, సమూహాలలో వైరస్ ప్రభావాన్ని వాస్తవ సమయంలో గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. హైదరాబాద్, అలహాబాద్, దిల్లీ, కోల్​కతా, ముంబయి, నాగ్​పుర్, పుదుచ్ఛేరి, చెన్నై నగరాల్లో ఈ వ్యవస్థ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని తన ప్రెసెంటేషన్​లో వివరించారు.

ప్రస్తుత వైరస్ ధోరణిని తెలుసుకోవడమే కాకుండా.. భవిష్యత్​ వ్యాప్తిని గుర్తించేందుకూ ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు మండే. ఇన్ఫెక్షన్ ముప్పును గుర్తించేందుకు 'గాలి నమూనా వ్యవస్థ'ను నెలకొల్పాలని సూచించారు.

ఈ విషయం​పై లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్చిస్తానని వెంకయ్య తెలిపారు.

ఇదీ చదవండి:గుప్త నిధుల కోసం వేట- ఊపిరాడక ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details