రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో తాజాగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. నిందితులను ఎన్‌సీబీ కస్టడీకు తరలించేందుకు కోర్టును బుధవారం కోరుతామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబయి జోనల్ డైరెక్టర్ అయిన సమీర్ వాంఖడే తెలిపారు.
" ఈ రోజు మరో నలుగురిని అరెస్ట్ చేశాం. వాళ్లు రేవ్‌పార్టీని నిర్వహించారు. వీరిని ఎన్‌సీబీ కస్టడీకు తరలించేందుకు కోర్టును అనుమతి కోరతాం. ఇప్పటివరకు ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేశాం."
-- సమీర్ వాంఖడే, ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్