CRPF women commandos: వీఐపీలకు భద్రత కోసం సీఆర్పీఎఫ్లో మహిళా కమాండో సేవలు మొదలుకానున్నాయి. వీఐపీల భద్రత కోసమే ప్రత్యేకంగా 32 మంది మహిళా కమాండోలతో ఒక దళాన్ని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ భద్రతలో త్వరలో మహిళా కమాండోలు కూడా చేరనున్నట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. వీఐపీ భద్రతా విధులకు సంబంధించి ఇటీవలే మహిళా కమాండోలు 10 వారాల శిక్షణను పూర్తి చేసుకున్నారు. వీఐపీల నివాసాల వద్ద భద్రత, అసెంబ్లీ ఎన్నికల జరిగే రాష్ట్రాలలో వారి పర్యటనల సందర్భంగా మహిళా కమాండోల సేవలను సీఆర్పీఎఫ్ వినియోగించనుంది.
సోనియా, ప్రియాంక భద్రతకు సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు - ప్రియాంక న్యూస్
CRPF women commandos: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల భద్రతలో త్వరలోనే సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు చేరనున్నారు. వీఐపీ భద్రతా విధులకు సంబంధించి ఇటీవలే మహిళా కమాండోలు 10 వారాల శిక్షణను పూర్తి చేసుకున్నారు.
సోనియా, ప్రియాంక భద్రతకు సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు
Z ప్లస్ రక్షణలో ఉన్న వీవీఐపీలలో ఉన్న ఇతర మహిళా నేతల రక్షణలో కూడా మహిళా సిబ్బందిని సీఆర్పీఎఫ్ కేటాయించింది. Z ప్లస్ భద్రతలో ప్రస్తుతం ఐదుగురు వీఐపీలకు భద్రత కల్పిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ వర్గాల సమాచారం.
ఇదీ చదవండి:హరీశ్ రావత్ తిరుగుబాటు? తీవ్ర సంక్షోభంలోకి కాంగ్రెస్?