జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ జరిగింది. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాది.. గ్రనేడ్ విసిరిన పారిపోయినట్లు పేర్కొన్నారు.
"సీఆర్‌పీఎఫ్ 132వ బెటాలియన్ క్యాంపుపై ముష్కరులు గ్రనేడ్ విసిరారు. ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించాం" అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.