జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాను సహా, ఐదుగురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వస్తున్న ఎస్యూవీ కారు అదుపు తప్పి ఖుని నల్లా వద్ద లోయలో పడింది.
ఉదయం 9.45 గంటల ప్రాంతంలో శ్రీనగర్ నుంచి జమ్ము వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులను గారు రామ్, వనీత్ కౌర్, షాగున్ కుమార్, మహ్మద్ రఫీ గుజ్జర్, సంజీవ్ కుమార్‌లుగా గుర్తించారు.