తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'షా ఆదేశాలతోనే.. ఓటర్లపై జవాన్ల వేధింపులు' - అమిత్​ షా ఆదేశాలతోనే సిబ్బంది ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మమత

బంగాల్‌లో ఓటర్లను సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వేధిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

harassing voters in Bengal at Shah's behest
మమత

By

Published : Apr 7, 2021, 3:21 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు బంగాల్‌లో ఓటర్లను సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మహిళలను వేధించడం, పురుషులను కొట్టటం వంటి చర్యలకు జవాన్లు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. కూచ్​ బెహర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు.

ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారని మమత అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హింసలో 10 మంది చనిపోయారని చెప్పారు. ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై ఈసీ పర్యవేక్షణ ఉంచాలని అభ్యర్థించారు. నిజమైన జవాన్లను తాను గౌరవిస్తానని, మహిళలపై దాడులు చేసే వారిని, ప్రజలను వేధించే వారిని కాదని మమత తెలిపారు.

ఇదీ చదవండి:హరియాణాలో రైతులపైకి జల ఫిరంగుల ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details