కేంద్ర ప్రభుత్వం భారీగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 1.3 లక్షల సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేరిట.. మొత్తం జనరల్ డ్యూటీ(జీడీ) ఉద్యోగాలకు ప్రకటన విడుదలైంది. పురుషులతో పాటు మహిళలు కూడా ఇందులో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఉద్యోగాల భర్తీలో మాజీ అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
నోటిఫికేషన్ వివరాలు..
మొత్తం 1,29,929 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది. అందులో పురుషులకు 1,25,262 పోస్టులు ఉన్నట్లు వెల్లడించింది. మహిళలకు 4667 ఉద్యోగాలను కేటాయించింది. పోస్ట్ జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'సి', నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్ కంబాటెంట్)గా పోస్టులను ప్రభుత్వం వర్గీకరించింది. మూడో వేతన స్కేలు ప్రకారం.. రూ.21700- 69100 మధ్యలో జీతం ఉంటుంది. 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
వయసు పరిమితులు..
- అభ్యర్థులు కచ్చితంగా 18 నుంచి 23 మధ్య వయసుల వారై ఉండాలి.
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
- వెనుకబడిన వర్గాల వారికి మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
- మాజీ అగ్నివీరులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
- ఫస్ట్ బ్యాచ్ మాజీ అగ్నివీరులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది