Crowd in shirdi: మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో.. బాబాను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివస్తున్నారు. ఆలయానికి వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ శిర్డీకి వచ్చే భక్తుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం.
Devotees of shirdi sai baba: సాయిబాబా సమాధిని దర్శించుకునేందుకు పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. దాంతో భక్తులు.. బాబాను దర్శించుకునేందుకు కనీసం రెండు గంటల సమయం పడుతోంది. సెలవుల కారణంగా భక్తుల రాక పెరగనున్న దృష్ట్యా శిర్డీ శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం, వసతికి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టింది. క్రిస్మస్, నూతన సంవత్సర ప్రారంభ సమయంలో సాయినాథుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.