పెళ్లి ఇంటి నుంచి 3 కిలోల బంగారం, 30 కిలోల వెండి దోపిడీకి గురైంది. ఈ ఘటన కర్ణాటక చిక్కమగళూరులో జరిగింది.
పెళ్లిలో వారు... నగలతో దొంగలు!
చిక్కమగళూరుకు చెందిన సురేశ్ కుమార్కు బంగారం షాపు ఉండేది. కరోనా లాక్డౌన్ కారణంగా వ్యాపారంలో నష్టపోయన ఆయన తన దుకాణాన్ని మూసేయాలని అనుకున్నాడు. షాపులో ఉన్న బంగారాన్నంతా చిక్కమగళూరులో ఉన్న తన కొత్త ఇంట్లే దాచాడు.
కొద్దిరోజుల తర్వాత తన కుమార్తె పెళ్లి కుదిరింది. అక్టోబర్ 27న వివాహం జరిపించడానికి సురేశ్, కుటుంబ సభ్యులంతా హాసన్ వెళ్లారు.
3 కిలోల బంగారం, 30 కిలోల వెండి
ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగల ముఠా... 3 కిలోల బంగారం, 30 కిలోల వెండి దొంగిలించి పరారైంది.
" గత వారం బసవనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. అక్టోబర్ 28న... తమ ఇంట్లో చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 కిలోల బంగారం, 30 కిలోల వెండి దొంగతనం చేశారని పేర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించాం. బాధితుడి కొత్త ఇంట్లో పెళ్లి కోసం లైటింగ్ పనులు చేసిన వారిని ప్రశ్నించాం. సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించాం".
-అకాయ్ మచ్చింద్రా, ఎస్పీ.
ఇదీ చదవండి:ఆ చిన్నారిని కాపాడేందుకు గ్రామంలో 144 సెక్షన్