తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐపీఎస్​పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళపై కాల్పులు.. హైకోర్టుకు వెళ్లే ముందే..

ఝార్ఖండ్​లో ఓ గిరిజన మహిళపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఆమె హైకోర్టులో హాజరు కావడానికి కొన్ని గంటల ముందే.. ఆమెపై దాడి జరిగింది. దీంతో ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

criminals shot Sushma Baraik in ranchi
criminals shot Sushma Baraik in ranchi

By

Published : Dec 13, 2022, 7:55 PM IST

ఝార్ఖండ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. సుష్మా బడాయిక్ అనే గిరిజన మహిళపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఐపీఎస్​ అధికారిపై లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేసింది. అయితే.. మంగళవారం ఈ కేసుకు సంబంధించి సుష్మా హైకోర్టులో హాజరు కావాల్సి ఉంది. దానికి కొన్ని గంటల ముందే ఆమెపై కాల్పులు జరగడం.. ఝార్ఖండ్​లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మంగళవారం ఉదయం 9:30 గంటల సమయంలో సుష్మా బడాయిక్​ తన బాడీగార్డ్​తో కలిసి ఇంటి నుంచి స్కూటీపై వెళ్తుండగా.. ముగ్గరు దుండగులు బైక్​పై వచ్చి ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన సుష్మాను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కాల్పులు రాంచీలోని అర్​గోరా పోలీస్​స్టేషన్​ పరిధిలో ఉన్న సహజానంద్​ మార్కెట్​ ప్రాంతంలో జరిగాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

నటరాజన్​ అనే ఓ ఐపీఎస్​ అధికారి తనపై అత్యాచారం చేసినట్లు.. 2005లో సుష్మా బడాయిక్​ ఆరోపించింది. ఈ కేసుపై అప్పటి ప్రభుత్వం నటరాజన్​ను విధుల్లో నుంచి తప్పించింది. అయితే 2017లో స్థానిక కోర్టు నటరాజన్​కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో సుష్మా.. హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సుష్మా మంగళవారం హైకోర్టులో హాజరు కావలసి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే ఆమెపై ఈ కాల్పులు జరగడం పలు అనుమానాలకు కారణమైంది. దీంతో పాటుగా సుష్మా తనపై చాలా మంది ప్రముఖులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో ఆమెకు పోలీసులు రక్షణ కల్పించారు. ఓ బాడీగార్డును ఆమెకు రక్షణగా నియమించారు. ఈ వ్యవహారంలోనే సుష్మాపై దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details