తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంధ మహిళల క్రికెట్.. బంతే హైలైట్ - శబ్ధం చేసే బంతి

తమిళనాడులోని కన్యాకుమారిలో అంధులకు ప్రత్యేకంగా క్రికెట్​ మ్యాచ్ జరిగింది. తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​, నాగర్​కొయిల్​లోని బ్లైండ్​ అండ్​ పొంజెస్లీ కళాశాలలు దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

Cricket Match for the Differently abled in kanyakumari of tamilnadu
దివ్యాంగుల క్రికెట్టు.. బంతే హైలెట్టు

By

Published : Mar 21, 2021, 1:03 PM IST

అంధ మహిళలకు జరిగిన ప్రత్యేక క్రికెట్​ మ్యాచ్​ను క్రీడాకారులు తమదైన శైలిలో ఆడి, వీక్షకులతో ఔరా అనిపించారు. తమిళనాడు కన్యాకుమారిలో జరిగిన ఈ టోర్నీని నాగర్​కొయిల్​లోని బ్లైండ్​ అండ్​ పొంజెస్లీ కళాశాల, తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్(టీఎన్​సీఏ) సంయుక్తంగా శనివారం నిర్వహించాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్​లో వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మంది అంధ మహిళలు పాల్గొన్నారు.

దివ్యాంగుల క్రికెట్టు.. బంతే హైలెట్టు

బంతే ప్రత్యేకం..

అంధత్వ స్థాయి ఆధారంగా మూడు విభాగాలలో ఈ పోటీ జరిగింది. ఈ మ్యాచ్​లో క్రికెట్ బంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బౌలింగ్​ చేసే సమయంలో బంతి ఒక రకమైన శబ్దం చేస్తుంది. దానికి తగ్గట్టుగా క్రీడాకారులు అంచనా వేసి ఆడారు.

ఇదీ చూడండి: విద్యుత్తు​ టవర్​ ఎక్కి యువకుడి హల్​చల్​.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details