CRPF Forces Takes Control Over Nagarjuna Sagar Dam :నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project ) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకారం తెలిపాయి. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 5:00 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో మధ్యాహ్నం కల్లా డ్యామ్ పూర్తిగా కేంద్రం వారి అధీనంలోకి వెళ్లనుంది.
Nagarjuna Sagar Water Dispute Updates : ఆ తర్వాత 13వ గేట్ వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. సీఆర్ఫీఎఫ్ బలగాల రాకతో.. తెలంగాణ పోలీసులు డ్యామ్ వద్ద నుంచి వెనుదిరిగారు. మరోవైపు సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
సాగర్ వార్ - ఇరు రాష్ట్రాల ఖాకీల పహారాతో టెన్షన్ టెన్షన్ - ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీటి విడుదల, ఆ రాష్ట్ర పోలీసు బలగాల మోహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్‌లైన్ ద్వారా అత్యవసర సమీక్ష జరిపారు. గత నెల 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో తలెత్తిన వివాదంపై భల్లా సమీక్ష నిర్వహించారు.