గుజరాత్లోని వల్సాద్ జిల్లా పార్దీ గ్రామంలో నివసించే ఓ కాటికాపరి మానవత్వం చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జరుగుతున్న తన నిశ్చితార్ధాన్ని విడిచి.. గౌరవ్ పటేల్ కరోనా రోగులకు అంత్యక్రియలు నిర్వహించాడు. గతనెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 26న గౌరవ్ పటేల్ నిశ్చితార్థం. ఇంతలో శ్మశాన వాటికకు కరోనా కారణంగా మృతి చెందిన ముగ్గురి మృతదేహాలు వచ్చాయి. అయితే దహనసంస్కారాలు నిర్వహించేందుకు వినియోగించే యంత్రాలలో లోపం తలెత్తింది. దీంతో శ్మశాన వాటిక కార్యదర్శి సంజయ్ బరియా.. గౌరవ్కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే నిశ్చితార్థానికి ధరించిన దుస్తులతోనే గౌరవ్ హుటాహుటిన శ్మశానానికి చేరుకున్నాడు. సమస్యను పరిష్కరించి, స్వయంగా దహనసంస్కారాలను నిర్వహించాడు.