తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rahul gandhi: 'కరోనా మరణాలపై సరైన లెక్కలు చెప్పాల్సిందే' - rahul on gujarat model

దేశంలో కరోనా మరణాలపై విశ్వసనీయమైన సమాచారాన్ని(Rahul covid death data) కేంద్రం విడుదల చేయాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని అన్నారు. గుజరాత్​లో కరోనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు.

Rahul covid death data, rahul tweet
రాహుల్ గాంధీ

By

Published : Nov 24, 2021, 2:32 PM IST

కరోనా వేళలో కేంద్రం పని తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో కొవిడ్​ మరణాలపై విశ్వసనీయమైన సమాచారాన్ని కేంద్రం సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం(Rahul on covid compensation) అందిచాలని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్(Rahul gandhi tweet) చేశారు.

"కాంగ్రెస్ పార్టీ రెండు డిమాండ్లు చేస్తోంది. అందులో మొదటిది కొవిడ్​ మరణాలపై విశ్వసనీయమైన సమాచారాన్ని కేంద్రం అందించాలి. రెండోది.. కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారాన్ని అందించాలి. ప్రజల బాధను తగ్గించే విధంగా.. ప్రభుత్వం వారికి ఈ పరిహారాన్ని అందించాలి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

#4LakhDenaHoga అనే హ్యాష్​ట్యాగ్​తో రాహుల్ హిందీలో చేసిన తన ట్వీట్​కు ఓ వీడియోను జోడించారు. గుజరాత్​లో కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కటుంబాల గురించి అందులో ఉంది. ఆ వీడియోలో.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని వారు ఆరోపించారు. ఈ వీడియోలో మాట్లాడిన రాహుల్​.. భాజపా అనుసరిస్తున్న 'గుజరాత్ మోడల్'​ను (Congres on gujarat model) తప్పుబట్టారు. కాంగ్రెస్​ 'న్యాయ్ క్యాంపెయిన్'​లో(Congress nyay campaign) భాగంగా ఈ నాలుగున్నర నిమిషాల వీడియోను రాహుల్ షేర్ చేశారు.

"గుజరాత్​లో 'గుజరాత్ మోడల్' గురించి ఎక్కువగా మాట్లాడుతారు. కానీ, మేం కొన్ని కుటుంబాలతో మాట్లాడాం. వాళ్లు తమకు కరోనా సమయంలో ఆస్పత్రిలో పడక దొరకలేదని, వెంటిలేటర్ దొరకలేదని వాపోయారు. వాళ్లకు ఆస్పత్రిలో సాయం చేయాల్సిన సమయంలో మీరు(ప్రభుత్వం) అండగా లేరు. దాని వల్ల వారు ఆస్పత్రుల్లో రూ.10-15 లక్షల వరకు కోల్పోవాల్సి వచ్చింది. వారి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఏ రకమైన ప్రభుత్వం?" అని వీడియోలో రాహుల్ ప్రశ్నించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details