తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో జోషీమఠ్ తరహా ఘటన.. ఇళ్లకు పగుళ్లు.. ఆందోళనలో స్థానికులు - జమ్ముకశ్మీర్ దోడాలో భూమి కుంగిన ఘటన న్యూస్

జమ్ముకశ్మీర్​లోని జోషీమఠ్ తరహా ఘటన జరిగింది. భూమి కుంగిపోయి 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

Cracks in houses at jammu kashmir Doda news
జమ్ముకశ్మీర్​లో జోషిమఠ్ తరహా ఘటన

By

Published : Feb 3, 2023, 5:31 PM IST

ఉత్తరాఖండ్ జోషీమఠ్​లో భూమి కుంగిపోయి వందలాది ఇళ్లు దెబ్బతిన్న తరహా ఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది. దోడా జిల్లాలోని థాత్రి ప్రాంతంలో భూమి కుంగిపోయి శుక్రవారం 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
సమీప ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్లే ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే తమను సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో స్థానిక యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. తామే బంధువులు, సన్నిహితులు ఇంటికి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు.

ఇళ్లు పగుళ్లు ఏర్పడడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. అయితే సమీప ప్రాంతంలో బుల్డోజర్​తో తవ్వకాలు జరపడం వల్లే భూమి కుంగిపోయిందని.. అందుకే తమ ఇళ్లు పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లు పగుళ్లు ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకుంటాం. మరోవైపు బుల్డోజర్​తో తవ్వకాల జరపడం వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం లేదు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను తెలుసుకునేందుకు జియోలాజికల్ నిపుణులను కూడా రప్పిస్తున్నాం.

--స్థానిక యంత్రాంగం

ABOUT THE AUTHOR

...view details