తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీపీఎం కార్యాలయాలకు నిప్పంటించిన దుండగులు - త్రిపుర హింసాత్మక ఘటనలు

త్రిపురలోని సీపీఎం కార్యలాయలకు నిప్పంటించారు కొంతమంది దుండగులు. దీంతో ఆయా ప్రాంతాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. ఇది భాజపా కార్యకర్తల పనేనని సీపీఎం ఆరోపించింది.

cpm offices set on fire
సీపీఎం కార్యాలయాలకు నిప్పంటించిన దుండగులు

By

Published : Sep 8, 2021, 11:16 PM IST

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో దుండగులు బీభత్సం సృష్టించారు. రాజధాని నగరం అగర్తలాలోని సీపీఎం ప్రధాన కార్యాలయంతో పాటు మరో జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి నిప్పంటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. అగర్తలాలోని సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్‌తోపాటు దశరథ్‌ భవన్‌కు కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అక్కడున్న వాహనాలకు ధ్వంసం చేసి వాటికి కూడా నిప్పంటించారు. బిశాల్‌బార్గ్‌, కతాలియా జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇటీవల సీపీఎంతో తలెత్తిన ఘర్షణలకు నిరసనగా భాజపా చేపట్టిన ప్రదర్శన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

త్రిపురలోని తమ కార్యాలయాలపై దుండగులు దాడికి సంబంధించిన పలు వీడియోలను సీపీఎం ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇది భాజపా మూకల పనేనని ఆరోపించింది. 'భాజపా గూండాలు అగర్తలాలోని రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ప్రజా సంక్షేమం కోసం గళమెత్తుతున్న సీపీఎంపై భాజపా దాడులకు పాల్పడుతోంది'అని ట్విటర్‌లో పేర్కొంది. ఈ వీడియోలో అనేకమంది యువకులు కర్రలు, రాళ్లు పట్టుకొని సీపీఎం కార్యాలయం వద్దకు చేరుకోవడం.. రాళ్లు రువ్వడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. పలువురి వద్ద కాషాయ జెండాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. సీపీఎం ఆరోపణలపై భాజపా స్పందించింది. సీపీఎం కార్యాలయంలో బాంబులు పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించింది.

త్రిపురలో సీపీఎం కార్యాలయాలకు నిప్పంటించిన దుండగులు
త్రిపురలో సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద దుండగులు నిప్పంటించిన వాహనం
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

ABOUT THE AUTHOR

...view details