Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరో విడత బాధ్యతలు నిర్వర్తించనున్నారు సీతారాం ఏచూరి. పార్టీ నాయకత్వ బాధ్యతల్ని వరుసగా మూడోసారి ఆయనకు అప్పగిస్తూ కేరళ కన్నూర్‌లో సీపీఎం 23వ వార్షిక సదస్సులో నేతలంతా తీర్మానం చేశారు. 2015లో తొలిసారి సీపీఎం పగ్గాలు చేపట్టారు సీతారాం ఏచూరి. 2018లో రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు.
ఏచూరి హ్యాట్రిక్.. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ అవకాశం - సీతారాం ఏచూరి
Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. కేరళలో జరిగిన 23వ వార్షిక సదస్సులో కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేరకు నిర్ణయించింది.
![ఏచూరి హ్యాట్రిక్.. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ అవకాశం cpm general secretary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14981042-193-14981042-1649584417894.jpg)
ఏచూరి హ్యాట్రిక్.. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ అవకాశం
సీపీఎం.. సాధారణంగా ప్రతి ప్రధాన కార్యదర్శికి మూడు సార్లు అవకాశమిస్తుంది. ఎస్. రామచంద్రన్ పిళ్లై, హన్నూన్ ముల్లా, భీమన్ బసు వయసు కారణంగా ముందుగానే ఆ పదవి నుంచి వైదొలిగారు. సీపీఎం పొలిట్‌బ్యూరోలో 17 మంది ఉంటారు.
ఇదీ చదవండి:'వ్యాక్సిన్ 3.0' షురూ.. 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోస్
Last Updated : Apr 10, 2022, 3:59 PM IST