CPI Narayana Comments on Chandrababu Arrest : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్ట్ (Chandrababu Arrest)చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అర్ధరాత్రి అరెస్టు చేయటం (CPI Narayana Comments on Chandrababu Arrest) అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు.
ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన నారాయణ.. చంద్రబాబు అరెస్టులో ఒక సాధారణ పౌరుడిని అరెస్టు చేసే విధానాన్ని సైతం పాటించలేదని విమర్శించారు. అమిత్ షా అనుమతి లేకుండా ఈ అరెస్టు జరగదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా బీజేపీ కుటిల నీతిని తెలుసుకోవాలని నారాయణ పేర్కొన్నారు.
"మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదు. ఒక వ్యక్తిని ఎలా అరెస్ట్ చేయాలో సీఐడీకి చెప్పాలా? జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైఖరి సరికాదు." - నారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
CPI Narayana Comments on Chandrababu Arrest అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదు
Mandakrishna Madiga Respond to Chandrababu Arrest : చంద్రబాబు నాయుడు అరెస్టును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా (Mandakrishna Madiga Respond to Chandrababu Arrest) ఖండించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనకు నచ్చిన వారికి ఒకలా.. నచ్చని వారితో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా పోలీసులతో అడ్డుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి.. స్కిల్ డెవలప్‌మెంట్ ఆరోపణల్లో 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఆగమేఘాల మీద అరెస్టు చేయడం వెనక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case: జగన్ తమ్ముడికి ఒక రూల్.. ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా!
చంద్రబాబు విషయంలో గవర్నర్ దృష్టికి తీసుకురాకుండా అరెస్టు చేశారంటే.. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుందని మందకృష్ణ మాదిగ దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ మోసాలను ఎండగడితే శత్రువులుగా చూస్తారని.. ప్రజాస్వామ్యం బతకాలంటే పాలకులు పౌరులు, ప్రతిపక్షాలను గౌరవించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి కనిపిస్తుందని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తెలుగుదేశం ఇతర పక్షాలు ఎటువంటి నిర్ణయం, ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఎమ్మార్పీఎస్ అదే నిర్ణయం తీసుకుంటుందని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.
"చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలకులు చెప్పినట్లు పోలీసులు చేసినట్లు కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాశ్‌ను అరెస్టు చేయట్లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఆగమేఘాల మీద అరెస్టు చేశారు. అజేయ కల్లం, ప్రేమేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవట్లేదు. పార్టీలు ఆందోళన చేపడితే ఎమ్మార్పీఎస్ మద్దతు ఉంటుంది."- మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
Mandakrishna Madiga Responded on Chandrababu Arrest చంద్రబాబు విషయంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు TDP Leaders Protest in Telangana Against Chandrababu Arrest : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. వసంత్‌నగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల కండువాలు ధరించి.. జగన్ అరాచక పాలన నశించాలని నినాదాలు చేశారు. చంద్రబాబు పట్ల.. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి సరికాదని వారు మండిపడ్డారు.
CID Investigation in Chandrababu Case: అంతా స్క్రిప్ట్ ప్రకారమే.. ఎంచుకున్న వారిపైనే కేసులు, అరెస్టులు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని మండిపడ్డారు. వెంటనే చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు
Arguments in ACB Court: లాయర్ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత