తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాకూటమి నందిగ్రామ్ అభ్యర్థిగా మీనాక్షీ ముఖర్జీ

బంగాల్​ నందిగ్రామ్​లో తమ అభ్యర్థిని ఖరారు చేసింది మహా కూటమి. సీఎం మమతా బెనర్జీ, సువేందు అధికారిలకు పోటీగా.. సీపీఐ(ఎం)నేత మీనాక్షీ ముఖర్జీని బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది.

CPI(M) fields Minakshi Mukherjee against Mamata, Suvendu from Nandigram
మమత, సువేందుకు పోటీగా మహాకూటమి తరఫున ముఖర్జీ

By

Published : Mar 10, 2021, 9:21 PM IST

బంగాల్​లో కీలకంగా మారిన నందిగ్రామ్​ అసెంబ్లీ స్థానంలో.. మహా కూటమి(వామపక్షం-కాంగ్రెస్​-ఐఎస్​ఫ్​) తరఫున సీపీఐ(ఎం​) నేత మీనాక్షి ముఖర్జీ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు వామపక్ష నేతృత్వంలోని కూటమి నిర్ణయించినట్టు ఛైర్మన్​ బిమాన్​ బోస్​ తెలిపారు.

తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) నుంచి సీఎం మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నందువల్ల.. ఆ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

ABOUT THE AUTHOR

...view details