తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తైవాన్ జోలికి వస్తే తగ్గేదేలే.. అవసరమైతే ఆ పనీ చేస్తాం' - తైవాన్​ జిన్​పింగ్

CPC Meeting China : తైవాన్‌ను చైనా భూభాగంతో ఏకం చేయడానికి అవసరమైతే బలప్రయోగానికీ వెనుకాడబోమని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ప్రారంభ ఉపన్యాసం చేసిన జిన్‌పింగ్‌.. తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై మండిపడ్డారు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తోందని, ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

cpc meeting china
జిన్​పింగ్

By

Published : Oct 16, 2022, 8:10 PM IST

CPC Meeting China : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోవడమే అజెండాగా చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో 2,296 మంది పార్టీ ప్రతినిధులు ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీవితకాలం అధికారంలో కొనసాగడానికి వీలుగా ఓటువేయనున్నారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు

ఈ సమావేశాల్లోనే జిన్‌పింగ్‌ మినహా ప్రధానమంత్రి లీ కెకియాంగ్​తో పాటు సీనియర్ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఆ స్థానాల్లో కొత్తవారిని నియమించనున్నారు. సీపీసీ సమావేశాలు.. జిన్‌పింగ్​కు మరిన్ని అధికారాలను కట్టబెట్టనున్నాయి. అందుకోసం 9.5 కోట్ల మంది పార్టీ సభ్యులకు మార్గదర్శకత్వం చేసే సీపీసీ నిబంధనావళిని సవరిస్తారు. పార్టీ ఇకపై అనుసరించాల్సిన సైద్ధాంతిక పంథా, వ్యూహాత్మక దృక్పథాన్ని ఈ మహాసభల్లో ఆమోదిస్తారని సీపీసీ ప్రతినిధి సన్ యెలి చెప్పారు.

హాంకాంగ్​లో సుపరిపాలన
మహాసభలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేసిన జిన్‌పింగ్.. అధ్యక్షుడిగా గత పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని వివరించారు. హాంకాంగ్‌పై చైనా స్పష్టమైన ఆధిపత్యం సాధించిందని జిన్‌పింగ్ తెలిపారు. ఆందోళనలతో అట్టుడికిన ప్రాంతాన్ని సుపరిపాలన వైపు నడిపించామని పేర్కొన్నారు. తైవాన్‌ వేర్పాటువాదంపైనా స్పందించిన ఆయన... చైనా ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో జిన్​పింగ్​

'బలప్రయోగ అస్త్రాన్నీ ప్రయోగిస్తాం'
ప్రపంచ రాజకీయాల్లో ప్రచ్ఛన్నయుద్ధ ధోరణిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబం‍ధాల్లో అనిశ్చితిపై మాత్రం జిన్‌పింగ్‌ స్పందించలేదు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తోందన్న ఆయన, ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. తైవాన్‌ సార్వభౌమాధికార దేశమని తనకు తానే భావిస్తోందని మండిపడిన జిన్‌పింగ్‌ దాన్ని చైనా మాత్రం విడిపోయిన ప్రావిన్సుగానే చూస్తోందని తెలిపారు. పునరేకీకరణ కోసం చిత్తశుద్ధితో శాంతియుతంగా ప్రయత్నిస్తామన్న జిన్‌పింగ్.. తైవాన్‌ ఏకీకరణకు బలప్రయోగ అస్త్రాన్నీ విడిచిపెట్టలేమని స్పష్టం చేశారు.

జిన్​పింగ్

అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌తో ఏర్పాటైన క్వాడ్‌ కూటమిపైనా.. చైనా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, అమెరికా, యూకేతో కలిపి ఆకస్​ కూటమి కూడా ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేసిన జిన్‌పింగ్.. చైనా అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ కూటములు ఏర్పాటయ్యాయని విమర్శించారు. చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకునేందుకు సైన్యాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:బార్​లో షూటింగ్.. 12 మంది మృతి.. మరో ముగ్గురికి గాయాలు

జోరుగా ఆయుధాల కొనుగోళ్లు- అమెరికాకు లాభాల పంట

ABOUT THE AUTHOR

...view details