CP Ranganath on Preethi Suicide: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేఎంసీ మెడికల్ విద్యార్థి ప్రీతి మృతిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రీతి శవపరీక్ష నివేదిక వచ్చిందని వెల్లడించారు. ఆ నివేదికలో ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని.. అతడి వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. దీనికి సంబంధించి వారం, పది రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.
Preethi Suicide: కేఎంసీ మెడికో ప్రీతిది ఆత్మహత్యే: సీపీ రంగనాథ్ - వైద్యవిద్యార్థిని ప్రీతి
18:15 April 21
Preethi Suicide: ప్రీతి శవపరీక్ష నివేదిక వచ్చింది: సీపీ రంగనాథ్
'కేఎంసీ మెడికో ప్రీతిది ఆత్మహత్యే. ప్రీతి శవపరీక్ష నివేదిక వచ్చింది. ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఆత్మహత్యకు ప్రీతి సీనియర్ సైఫ్ ప్రధాన కారణం. వారం, 10 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం'. -రంగనాథ్, వరంగల్ సీపీ
ఇదీ జరిగింది: సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని మృత్యువుతో పోరాడుతూ.. ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతిని.. సీనియర్ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఫిబ్రవరి 22వ తేదీన హానికరమైన ఇంజెక్షన్ చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తొలుత ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వైద్య విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.
Preethi Suicide Update: అయితే ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతునే ప్రీతి మృతి చెందింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయంగా మారడంతో, రాజకీయంగానూ దుమారం రేపడంతో ఇందుకుగానూ.. వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. దీంతో కాకతీయ వైద్య కళాశాలలోని మత్తు మందు(అనస్థీషియా) ప్రొఫెసర్, విభాగాధిపతి కె.నాగార్జునరెడ్డిని బదిలీ చేసింది.
ఇవీ చదవండి: