కరోనా మహమ్మారిని కట్టడి చేసే బృహత్తర వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ బుధవారం(ఏప్రిల్ 28) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించటం వల్ల వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. చాలా మందికి ఈ సమస్యలు తలెత్తడంతో వారంతా సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ సమస్య తలెత్తింది.
టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ.. సర్వర్‌లో సాంకేతిక సమస్యలు - రిజిస్ట్రేషన్ల వెల్లువ.. కొవిన్ పోర్టల్ క్రాష్
18 ఏళ్లు దాటిన వారికి టీకా నమోదు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే.. కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్‌లో సమస్యలు తలెత్తాయి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ సంఖ్యలో యువత ఒక్కసారిగా కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించటం వల్ల సర్వర్ మొరాయించింది.
![టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ.. సర్వర్‌లో సాంకేతిక సమస్యలు cowin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11569434-thumbnail-3x2-222.jpg)
టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ.. కొవిన్ పోర్టల్ క్రాష్
అయితే కొద్ది మందికి మాత్రం ఎలాంటి సమస్యలు రాలేదు. అటు ఆరోగ్యసేతు యాప్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైనట్లు నెటిజన్లు పోస్ట్‌లు చేశారు. సర్వర్ ఎర్రర్ మెసేజ్ వచ్చినట్లు చెప్పారు. కొంతమందికి ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి. అయితే ప్రస్తుతం కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అందుబాటులోనే ఉంది.
ఇదీ చూడండి:కొవిడ్ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్
Last Updated : Apr 28, 2021, 5:51 PM IST