Covovax In India: సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవొవాక్స్ టీకాను 12 నుంచి 17 ఏళ్ల వయసు వారికి అత్యవసర వినియోగ అనుమతి కింద ఇవ్వవచ్చని కేంద్ర ఔషధ నియంత్ర సంస్థకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే దీనిని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదించాల్సి ఉంది. ఒకవేళ డీసీజీఐ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు వస్తే.. కొవొవాక్స్ 12-17 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు ఇచ్చే నాలుగో టీకా అవుతుంది.
12-17 ఏళ్లవారికి కొవొవాక్స్ టీకా- అత్యవసర వినియోగానికి సిఫార్సు - కరోనా టీకా
Covovax In India: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవొవాక్స్ టీకాను 12 నుంచి 17 ఏళ్ల వయసు వారికి అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వవచ్చని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనిని డీసీజీఐ ఆమోదించాల్సి ఉంది.
పెద్దలకు ఈ టీకా వేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గత ఏడాది డిసెంబరు 28న నియంత్రిత అత్యవసర వినియోగ అనుమతినిచ్చింది. అయితే, మనదేశ టీకా కార్యక్రమంలో ఈ వ్యాక్సిన్‌ను ఇంకా చేర్చలేదు. 12-17ఏళ్ల వారికి కూడా కొవొవాక్స్‌ను సిఫార్సు చేసేందుకు అనుమతించాల్సిందిగా సీరమ్ సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఫిబ్రవరి 21న దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసింది.
ఇదీ చూడండి:ఉక్రెయిన్‌లో నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులకు కేంద్రం ఊరట