ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించటంపై సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. వారాల వ్యవధిలోనే టీకాలను విడుదల చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కొవిషీల్డ్ అన్ని అంచెలను దాటిందన్నారు. సురక్షితమైన, సమర్థత కలిగిన టీకాను త్వరలోనే తీసుకురానున్నట్లు చెప్పారు.
'మరికొన్ని వారాల్లోనే టీకా అందిస్తాం' - కొవిషీల్డ్ కు డీసీజీఐ ఆమోదం
మరికొద్ది వారాల్లో తమ టీకా అందుబాటులోకి రానున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా తెలిపారు. భారత్లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి 'కొవిషీల్డ్'కు అనుమతి లభించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
!['మరికొన్ని వారాల్లోనే టీకా అందిస్తాం' 'Covishield' ready to roll out in coming weeks: Poonawalla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10101361-961-10101361-1609654957044.jpg)
'మరికొన్ని వారాల్లోనే టీకా'
దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించిన తొలిటీకా కొవిషీల్డ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, డీసీజీఐకి ధన్యవాదాలు తెలిపారు.