తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డెల్టా వేరియంట్​పై ఆ టీకా భేష్​' - dose interval covid vaccine

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్​పై ఎన్‌టీఏజీఐ ఛైర్మన్ డాక్టర్‌ ఎన్‌కే అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా రకం వైరస్‌పై కొవిషీల్డ్‌ ఒక డోసు 61 శాతం, రెండు డోసులు 65 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు. రెండు డోసుల ప్రభావం మధ్య పెద్దగా తేడా లేదని, అందువల్ల డోసుల వ్యవధి పెంచడం వల్ల నష్టం లేదని వివరించారు.

Covishield dose interval
కొవిషీల్డ్

By

Published : Jun 16, 2021, 1:25 PM IST

కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధిని 12-16 వారాలకు పెంచాలన్న నిర్ణయం పూర్తి శాస్త్రీయంగా తీసుకున్నదని, ఎలాంటి భిన్నాభిప్రాయం వ్యక్తం కాలేదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్‌టాగీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా ప్రకటించారు. మన దేశంలో.. డెల్టా రకం వైరస్‌పై కొవిషీల్డ్‌ ఒకడోసు 61 శాతం; రెండు డోసులు 65 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు. రెండు డోసుల ప్రభావం మధ్య పెద్దగా తేడా లేదని, అందువల్ల డోసుల వ్యవధి పెంచడం వల్ల నష్టం లేదని వివరించారు. కొవిషీల్డ్‌ డోసుల మధ్య గడువు తగ్గించాలన్న వాదనల నేపథ్యంలో మంగళవారం ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

"బ్రిటన్‌లో కనిపించిన ఫలితాల ఆధారంగా కొవిషీల్డ్‌ గ్యాప్‌ను తొలుత పెంచాం. చండీగఢ్‌లో వైద్య ఆరోగ్య సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో ఒక డోసు ఇచ్చినవారిపైనా, రెండు డోసులు ఇచ్చిన వారిపైనా కొవిషీల్డ్‌ ప్రభావం 75% మేర కనిపించింది. రెండు డోసుల మధ్య గ్యాప్‌ ఎక్కువ ఉన్నప్పటికీ ఒక డోసుతో రక్షణ లభిస్తుందని దీని ద్వారా తేలింది"

-- డాక్టర్‌ ఎన్‌కే అరోడా, ఎన్‌టీఏజీఐ ఛైర్మన్‌

కరోనా నిరంతరం మారుతూ ఉంటుందని, అందువల్ల రేప్పొద్దున వచ్చిన అధ్యయనాల్లో గ్యాప్‌ను తగ్గించాలని, దానివల్ల 5-10% మందికి ఎక్కువగా మేలు జరుగుతుందని తేలినా తాము ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి :'డెల్టా ప్లస్'​ కరోనా​పై కేంద్రం కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details