కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు అందించిన వ్యాక్సిన్ డోసులలో సీరం ఇనిస్టిట్యూట్ తయారీ చేస్తున్న కొవిషీల్డ్ టీకాలే 90శాతం ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 12కోట్ల 76లక్షల 5వేల 870 కరోనా టీకా డోసులను అందజేయగా, వీటిలో కొవిషీల్డ్ డోసులు 11 కోట్ల 60లక్షల 65వేల 107 ఉన్నట్లు కొవిన్ పోర్టల్‌లో కేంద్రం వివరాలను పొందుపర్చింది. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా డోసులు ఒక కోటి 15లక్షల 40వేల 763 అందజేసినట్లు కేంద్రం వెల్లడించింది.
కేవలం కొవిషీల్డ్ మాత్రమే..
దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేవలం కొవిషీల్ట్ టీకాను మాత్రమే అందజేసినట్లు ఓ నివేదికలో కేంద్రం వెల్లడించింది. కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ టీకాల తయారీ భారీ ఎత్తున జరుగుతున్నందున అవి ఎక్కువగా అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి కూడా పెరుగుతుందని భారత వైద్య పరిశోధనా మండలి నిపుణులు సమీరన్ పాండా తెలిపారు. కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 70 కోట్లకు పెంచుకోనున్నట్లు మంగళవారం భారత్ బయోటెక్ కూడా ప్రకటించింది.
95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీ