ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా వంటి పలు ఔషధ సంస్థలు తమ టీకా సామర్థ్యం గురించి ప్రకటనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి టీకా పంపిణీని నిర్ధరించేందుకు త్వరలో 'కొవిన్' యాప్‌ను అందుబాటులోకి తేనుంది కేంద్ర ప్రభుత్వం.
కొవిన్ యాప్ ద్వారా టీకాల నిల్వను డిజిటల్‌గా ట్రాక్ చేసేందుకు వీలు కల్పిస్తారు. వ్యాక్సిన్ లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అలాగే టీకా లబ్ధిదారుల గురించి సమాచారం ఇవ్వనుంది ఈ యాప్.
ఇవిన్ వ్యవస్థకు సంస్కరణ..
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గతంలో ఉపయోగించిన ఇవిన్ వ్యవస్థకు వేగవంతమైన, మెరుగైన సంస్కరణ అని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
"మొత్తం ఇవిన్ ప్లాట్‌ఫాం కొవిన్ నెట్‌వర్క్‌గా మెరుగులు దిద్దుకుంది. ఈ యాప్ ద్వారా నిల్వ గురించిన సమాచారాన్ని డిజిటల్‌గా ట్రాక్ చేయవచ్చు. అలాగే టీకాకు రెండు షాట్లు అవసరం కాబట్టి మొదటి షాట్ పొందిన వారిని రెండుమూడు వారాల తర్వాత ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు" అని హర్షవర్ధన్ తెలిపారు.
కరోనా టీకా పురోగతి, పంపిణీకి సంబంధించిన సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి:'చివరి దశకు చేరుకున్న కరోనా అధ్యయనం'