తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరిగిన కొత్త కేసులు-  మరో 41,195మందికి కరోనా - దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 41,195మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

covid-19 cases
కొవిడ్​ కేసులు

By

Published : Aug 12, 2021, 9:30 AM IST

Updated : Aug 12, 2021, 10:16 AM IST

దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా 41,195మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ రికవరీ రేటు 97.45 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,87,987కి పెరిగింది.

కొవిడ్​ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 21,24,953 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,73,70,196కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో కొత్తగా 22,500 కేసులు నమోదయ్యాయి. మరో 19,411 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 116 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 1,078 మందికి కరోనా సోకగా.. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 1,319 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో 1,964 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,197 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,826 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,618 మంది కోలుకోగా.. 33 మంది మృతిచెందారు.

ఇదీ చదవండి:'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్​ డోసులు కష్టం'

Last Updated : Aug 12, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details