భారత్‌లో రోజువారి కరోనా కేసుల సంఖ్య (Coronavirus update) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 15,906 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్ ధాటికి (Covid cases in India) మరో 561 మంది మరణించారు. కొవిడ్ నుంచి ఒక్కరోజే 16,479మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు:34,175,707
- మొత్తం మరణాలు:4,54,269
- మొత్తం కోలుకున్నవారు:3,35,48,605
- యాక్టివ్ కేసులు:1,72,594
టీకా పంపిణీ
కొత్తగా 77,40,676 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,02,10,43,258కి పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగాను రోజువారి కరోనా కేసుల సంఖ్య (coronavirus worldwide) భారీగా తగ్గింది. తాజాగా 3,74,274 మంది వైరస్ (Corona update) బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 5,735 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,41,09,329కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,59,193కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కేసులు భారీగా తగ్గింది. కొత్తగా 28,824 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 484 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 37,678 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,075 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 44,985 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 135 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 26,217 మంది వైరస్ బారిన పడగా.. 217 మంది మరణించారు..
- బ్రెజిల్లో తాజాగా 11,716 మందికి కొవిడ్ సోకింది. మరో 358 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:బూస్టర్ డోసుపై ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు