India covid vaccine list:కొవిడ్ మహమ్మారిపై పోరులో భారత్ మరింత శక్తిమంతంగా మారింది. దేశంలో మరో రెండు కొత్త టీకాలతోపాటు ఓ ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన 'కొవొవాక్స్', బయోలాజికల్-ఇ సంస్థ అభివృద్ధిచేసిన 'కార్బెవాక్స్'లతో పాటు.. మోల్నుపిరవిర్ ఔషధం అత్యవసర వినియోగానికి కూడా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఆమోదం తెలిపింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వీటికి అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదించిన ఒక్కరోజు వ్యవధిలోనే సీడీఎస్‌సీఓ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Coronavirus India medicine list
దీంతో దేశంలో కొవిడ్ నియంత్రణకు, చికిత్సకు అందుబాటులో ఉన్న ఔషధ వనరుల సంఖ్య 12కు చేరింది. వాటిలో 8 టీకాలు కాగా, 4 ఔషధాలు. ఆ వివరాలివీ..
బూస్టర్ ట్రయల్స్!
కార్బెవాక్స్‌కు అత్యవసర అనుమతులు లభించిన విషయాన్ని టెక్సాస్ పిల్లల ఆస్పత్రి, బేలార్ వైద్య కళాశాల ధ్రువీకరించాయి. భారత్‌తో పాటు టీకాలు తక్కువగా అందుబాటులో ఉన్న ఇతర దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభిస్తామని పేర్కొన్నాయి.
CORBEVAX booster dose trials:మరోవైపు, 'కార్బెవాక్స్' టీకాను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు అవసరమైన ట్రయల్స్ నిర్వహించడానికి డీసీజీఐ అనుమతులు జారీ చేసింది. నిపుణుల కమిటీ విస్తృత చర్చలు జరిపిన తర్వాత మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ సిఫార్సు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో బూస్టర్ డోసు ప్రయోగాల కోసం అనుమతి పొందిన రెండో టీకా కార్బెవాక్స్ కావడం విశేషం. భారత్ బయోటెక్ టీకాకు ఇదివరకే బూస్టర్ డోసు ట్రయల్స్‌కు అనుమతులు వచ్చాయి.
నెలకు 10 కోట్ల డోసులు
కార్బెవ్యాక్స్ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌కు చెందిన 'బయోలాజికల్ ఇ' సంస్థ నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి నెలకు 10 కోట్ల డోసుల 'కార్బెవ్యాక్స్' టీకా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. కొవిడ్ మహమ్మారికి మనదేశంలో అభివృద్ధి చేసిన తొలి ప్రొటీన్ సబ్-యూనిట్ టీకా ఇదే కావటం గమనార్హం. ప్రస్తుతానికి నెలకు 7.5 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేయనున్నట్లు, ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి పెంచనున్నట్లు సంస్థ మంగళవారం తెలిపింది. హైదరాబాద్‌లోని తమ యూనిట్లలో టీకా ఉత్పత్తి చేయనున్నట్లు, దీన్ని దేశీయ అవసరాలకే కాకుండా... ప్రపంచ మార్కెట్‌కు 100 కోట్ల డోసుల వరకూ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వివరించింది.
'కార్బెవ్యాక్స్' టీకాను యూఎస్‌లోని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ (టెక్సాస్ చిల్డ్రన్స్ సీవీడీ), బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (బేలార్) ఇన్ హూస్టన్ సహకారంతో బయోలాజికల్ ఇ. అభివృద్ధి చేసింది. మనదేశంలో 33 ప్రదేశాల్లో 18- 80 ఏళ్ల మధ్య వయస్కులైన 3,000 మంది వలంటీర్లపై ఈ టీకా పరీక్షలు నిర్వహించారు. మూడో విడత క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా కరోనా వైరస్‌పై 90 శాతం ప్రభావశీలత కనబరచినట్లు కంపెనీ పేర్కొంది. అదే సమయంలో డెల్టా వేరియంట్‌పై 80 శాతం ప్రభావశీలత ఉన్నట్లు వివరించింది. తాము ఎన్నో ఏళ్లుగా టీకాలు ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు, ఈ అనుభవంతో చౌక ధరలో, నాణ్యమైన కొవిడ్ టీకా తీసుకువచ్చినట్లు బయోలాజికల్ ఇ. ఎండీ మహిమా దాట్ల అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బయోటెక్నాలజీ శాఖ అందించిన సహకారంతో నెలకు 120 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని తాము సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు.
కౌమారులు 7.4 కోట్లు
15 to 18 vaccination:దేశంలోని 15-18 ఏళ్ల కౌమారులకు టీకా అందించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ వయోవర్గంలో మొత్తం 7,40,57,000 మంది ఉన్నట్టు మంగళవారం గుర్తించింది. వీరికి జనవరి 3 నుంచి 'కొవాగ్జిన్' టీకాను అందించనుంది. మరోవైపు- 60 ఏళ్లు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు దేశంలో 2,75,14,000 మంది ఉన్నట్టు లెక్క తేల్చింది. వీరందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వనుంది.
ఇదీ చదవండి: