దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. టీకా అనివార్యమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరికీ సురక్షితంగా జీవించే హక్కు ఉందని, టీకా కోసం పోరాడాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
"దేశ అవసరాల్లో కొవిడ్ టీకా భాగమైంది. మీరందరూ దానికోసం గొంతెత్తాలి. సురక్షితమైన జీవితం ప్రతి ఒక్కరి హక్కు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 'స్పీక్ అప్ ఫర్ వ్యాక్సిన్ ఫర్ ఆల్(అందరికీ టీకా)' ప్రచార కార్యక్రమంలో భాగంగా..ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. దేశంలో పౌరులందరికీ వ్యాక్సిన్ అందించి.. వైరస్ నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు.
ట్విట్టర్లో ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు రాహుల్.
ఇదీ చదవండి:ఇవీ అస్తవ్యస్త రోగనిరోధక వ్యవస్థ లక్షణాలే!