తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అన్ని వేరియంట్లకు ఒకే టీకా'.. భారత శాస్త్రవేత్తల ఘనత

Corona Vaccine: కరోనా వైరస్​ అన్ని వేరియంట్లకు ఒకే టీకాను అభివృద్ధి చేశారు భారత శాస్త్రవేత్తలు. ఈ టీకాకు 'అభిఎస్‌సీవో వ్యాక్‌' అని పేరు పెట్టారు. ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు.

Covid Vaccine
Covid Vaccine

By

Published : Feb 7, 2022, 8:15 AM IST

Covid Vaccine: కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేసే సార్వత్రిక టీకాను అభివృద్ధి చేసినట్లు భారత శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది పెప్టైడ్‌ వ్యాక్సిన్‌. బంగాల్‌లోని కాజీ నజ్రుల్‌ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ఈ టీకాకు 'అభిఎస్‌సీవో వ్యాక్‌' అని పేరు పెట్టారు. దీని తయారీ కోసం ఇమ్యునోఇన్ఫర్మేటిక్‌ విధానాలను అనుసరించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనా తరగతిలోని అన్ని వైరస్‌లను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకునే టీకా మరొకటి ప్రపంచంలో ఎక్కడా లేదని వారు పేర్కొన్నారు.

ఆరు భిన్న వైరస్‌లలో స్పైక్‌ ప్రొటీన్‌లో కొన్ని భాగాలు చాలా తక్కువగా ఉత్పరివర్తనాలకు లోనవుతున్నట్లు తొలుత గుర్తించామన్నారు. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక స్పందనను కలిగించొచ్చని తెలిపారు. స్పైక్‌ ప్రొటీన్‌లోని ఈ భాగాలకు టీఎల్‌ఆర్‌4 అనే ప్రొటీన్‌తో బలమైన బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యం ఉందన్నారు. కరోనా వైరస్‌ను గుర్తించి, రోగ నిరోధక స్పందనను కలిగించడంలో ఈ ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇదీ చూడండి:5 కోట్ల కార్బివాక్స్‌ డోసులకు కేంద్రం ఆర్డర్‌.. అందుకోసమేనా..?

ABOUT THE AUTHOR

...view details