Covid vaccine for 12-14 year Old's:దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌పై చర్చ జరుగుతోంది. మార్చిలో తొలివారంలో ప్రారంభింస్తారనే ఊహాగాహనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 12-14 ఏళ్ల పిల్లలకు టీకా అందించటంపై శాస్త్రీయ ఆధారాల మేరకే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది కేంద్రం. ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్లు పేర్కొంది.
వారాంతపు మీడియా సమావేశంలో పిల్లలకు వ్యాక్సినేషన్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్.
" శాస్త్రీయ ఆధారాలు, అత్యంత ప్రభావిత ప్రజలను దృష్టిలో పెట్టుకునే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తరించటం శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉంది. 12 ఏళ్ల వయసుపైబడిన వారికి టీకా అందించాలనే ఆలోచన ఉంది. పూర్తిస్థాయి సైంటిఫిక్ సమాచారం అందిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. "