దేశంలోని మారుమూల ప్రాంతాలకు టీకాలు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా కేంద్రం డ్రోన్ల (Vaccine Drone Delivery) వినియోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ల పంపిణీని ప్రారంభించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.
ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మణిపుర్‌లోని విష్ణుపుర్ జిల్లా ఆసుపత్రి నుంచి లోక్తక్ సరస్సు వద్ద ఉన్న కరాంగ్కు డ్రోన్ సాయంతో (Vaccine Drone Delivery) టీకాలు పంపించారు.
"మేకిన్ ఇండియా డ్రోన్‌తో 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి టీకాను అందించడం దక్షిణాసియాలో ఇదే తొలిసారి. విష్ణుపుర్ ఆసుపత్రి నుంచి లోక్తక్ సరస్సు సమీపంలోని కరాంగ్ ప్రాంతానికి డ్రోన్ చేరేందుకు 12-15 నిమిషాలు పట్టింది. ఇదే రోడ్డు మార్గం అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య 26 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ డ్రోన్ ద్వారా సరఫరా చేసిన టీకాలతో ఈ రోజు 18 మంది లబ్ధిపొందుతారు."