కరోనా టీకా పొందడం స్వచ్ఛందమని.. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం యాంటీబాడీలు వృద్ధిచెందాలంటే కచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలని వెల్లడించారు ఎయిమ్స్ డైరక్టర్ డా. రణదీప్ గులేరియా వెల్లడించారు. రెండో డోసు తీసుకున్న 2వారాలకు యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలకు దీటుగా భారత్‌లో వినియోగించనున్న వ్యాక్సిన్లు ఉండనున్నాయని అభిప్రాయపడ్డారు గులేరియా. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రశ్నోత్తరాల కోసం రూపొందించిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్సైట్లో పోస్ట్ చేశారు.