Covid Vaccination Certificates: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జారీ అయ్యే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో కనిపించకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఇందుకోసం కొవిన్ పోర్టల్‌లో ఆ మేరకు మార్పులు చేయనుంది. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. మోదీ ఫొటో లేకుండానే వ్యాక్సిన్ సర్టిఫికెట్ - కరోనా టీకా పత్రంపై ప్రధాని మోదీ ఫొటో
Covid Vaccination Certificates: దేశంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జారీ అయ్యే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో కనిపించకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Covid Certificate: ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలకు ఈసీ శనివారం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటో లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం కొవిన్ పోర్టల్‌లో అవసరమైన ఫిల్టర్లను కేంద్ర ఆరోగ్య శాఖ వినియోగించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈసీ సూచనల మేరకు ఇదే తరహాలో మోదీ ఫోటో లేకుండా సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
ఇదీ చదవండి:దేశంలో కరోనా విలయం- ప్రధాని మోదీ కీలక భేటీ