తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగని కొవిడ్ ఉద్ధృతి- కేరళలో మరో 21 వేల కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఒక్క రోజులోనే 21,427 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాల లెక్కలు ఇలా ఉన్నాయి.

Corona case in India
భారత్​లో కరోనా కేసులు

By

Published : Aug 18, 2021, 10:42 PM IST

దేశవ్యాప్తంగా కరోనా భయాలు ఇంకా కొనసాగుతున్నాయి. కేరళలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో తాజాగా 21,427 మంది కొవిడ్​ బారిన పడ్డారు. 179 మంది మహమ్మారికి బలయ్యారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 37.25 లక్షల పైకి, మృతుల సంఖ్య 19,049 వద్దకు చేరింది.

కేరళలో తాజాగా 18,731 మంది కొవిడ్​ను జయించారు. ఇప్పటి వరకు మొత్తం 35,48,196 మంది రికవరీ అయ్యారు.

మహారాష్ట్రలో కొవిడ్ కేసులు కాస్త పెరిగాయి. బుధవారం సాయంత్రం వరకు ఇక్కడ 5,132 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. 158 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 8,196 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. కొవిడ్ రికవరీ రేటు 96.93 శాతంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

  • తమిళనాడులో కొత్తగా 1,797 మందికి కరోనా సోకింది. 1,908 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. 31 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో 1,365 మంది కరోనా బారిన పడ్డారు. 22 మంది కొవిడ్​కు బలయ్యారు. 1,558 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
  • దిల్లీలో 36 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా.. 76 మంది మహమ్మారిని జయించారు. నలుగురు కొవిడ్​తో మృతి చెందారు.

ఇదీ చదవండి:దోమలపై రాష్ట్రాల దుర్బలపోరు- ప్రజారోగ్యానికి తూట్లు!

ABOUT THE AUTHOR

...view details