తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో 15 రోజుల్లో 500శాతం పెరిగిన కేసులు

Covid Spread In Delhi: దిల్లీలో కరోనా రోజురోజుకు అధికమవుతోంది. తాజాగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కొవిడ్​ వ్యాప్తి 15 రోజుల్లోనే 500శాతం పెరిగినట్లు లోకల్​సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది.

covid cases in delhi
localcircles vaccine survey

By

Published : Apr 18, 2022, 5:19 AM IST

Covid Spread In Delhi: దేశరాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు వారాలుగా అక్కడ రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఇలా 15 రోజుల్లోనే దిల్లీ పరిసర ప్రాంత వాసుల్లో కొవిడ్‌ వ్యాప్తి 500శాతం పెరిగినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. తమ కుటుంబం లేదా సన్నిహితుల్లో ఎవరో ఒకరిలో కరోనా నిర్ధారణ అయినట్లు సర్వేలో పాల్గొన్న దిల్లీ-ఎన్‌సీఆర్‌ నివాసితుల్లో 19శాతం మంది వెల్లడించారు.

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా.. వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు 'లోకల్‌ సర్కిల్‌' ఓ సర్వే నిర్వహించింది. గడిచిన రెండు వారాల్లో మీ సన్నిహితుల్లో ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారని దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని 11,743 మంది నివాసితులను ప్రశ్నించగా.. ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని 70శాతం మంది వెల్లడించారు. మరో 11శాతం మంది మాత్రం తమ సన్నిహితుల్లో ఒకరు లేదా ఇద్దరు వైరస్‌ బారినపడ్డారని చెప్పారు. 8శాతం మంది ముగ్గురు నుంచి ఐదురుగుకి వైరస్‌ సోకిందని చెప్పగా.. మరో 11శాతం మంది 'చెప్పలేం' అనే సమాధానం ఇచ్చారు. ఏప్రిల్‌ 2వ తేదీన జరిపిన ఇటువంటి సర్వేలో కేవలం మూడు శాతం మంది మాత్రమే తమ సన్నిహితుల్లో ఎవరో ఒకరు కొవిడ్‌ బారినపడ్డారని తెలిపారు.

ఇక దేశ రాజధానిలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 300లకు పైగా నమోదుకాగా శనివారం నాడు కొత్తగా 461 కేసులు, రెండు కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5.33శాతానికి పెరిగింది. గడిచిన రెండు వారాలుగా కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు తేలడం వల్ల వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మరోసారి కొవిడ్ నిబంధనల అమలుకు దిల్లీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్తగా 517 కేసులు నమోదయ్యాయి. పాజిటివీటి రేటు 4.21 గా నమోదైంది.

ఇదీ చదవండి:'భారత్​లో 40లక్షల కరోనా మరణాలు- కేంద్రమే కారణం!'

ABOUT THE AUTHOR

...view details