కరోనా రెండో దశ ఉద్ధృతితో యావత్ దేశం అల్లాడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరట కల్పించే కబురు వెల్లడించింది. కరోనా రెండో దశకు ఈ ఏడాది జులైలో తెరపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 'సూత్ర' అనే విధానం ద్వారా ఈ శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. దేశంలో రోజువారీ కరోనా కేసులు.. మే నెలాఖరు కల్లా భారీగా తగ్గి లక్షా 50వేలకు చేరుకుంటాయని, జూన్ ఆఖరు నాటికి 20వేలకు తగ్గుతాయని తెలిపింది.
కొవిడ్ రెండో ఉద్ధృతికి జులైలో తెర! - కరోనా మూడో వేవ్
కరోనా రెండో దశ ఉద్ధృతి జులై కల్లా ముగుస్తుందని కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. 'సూత్ర'ప్రాయంగా అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు. మరో 6 నెలల తర్వాతే మూడో దశ ఉంటుందని తెలిపారు.

కొవిడ్, కరోనా
మరో ఆరు నుంచి 8 నెలల తర్వాతే కరోనా మూడో దశ ఉంటుందని.. శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అక్టోబర్ వరకు ఇది ఉండకపోవచ్చని తెలిపింది. మూడో దశ స్ధానికంగానే ఉంటుందని, వ్యాక్సినేషన్ కారణంగా ఎక్కువ మందిపై దీని ప్రభావం ఉండకపోవచ్చని వివరించింది.
ఇదీ చదవండి:'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
Last Updated : May 20, 2021, 6:58 AM IST