తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం!

కరోనా వ్యాప్తి నిరోధానికి పలు రాష్ట్రాలు అమలు చేస్తోన్న ఆంక్షలపై ట్రాన్స్‌పోర్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. పరిమిత సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నందున నిత్యం రూ.315 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పాయి.

By

Published : Apr 19, 2021, 7:16 AM IST

covid loss, transport sector
రవాణా రంగం, కరోనా

కరోనా వైరస్‌ ఉద్ధృతి కారణంగా ఆయా రాష్ట్రాలు అమలు చేస్తోన్న ఆంక్షలు వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆంక్షల కారణంగా రవాణా రంగం నిత్యం రూ.315 కోట్ల నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

"కరోనా వైరస్‌ తీవ్రత పెరగడం వల్ల చాలా రాష్ట్రాలు కేవలం అత్యవసర సేవలు, రవాణాను మాత్రమే అనుమతిస్తున్నాయి. తద్వారా దుకాణాలన్నీ మూతబడుతున్నాయి. దీంతో రవాణా రంగం రోజుకు దాదాపు రూ.315కోట్లు నష్టపోవాల్సి వస్తోంది" అని ఆల్‌ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) కోర్‌ కమిటీ ఛైర్మన్‌ బాల్‌మల్కిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. తాజా ఆంక్షల కారణంగా ట్రక్కులకు దాదాపు 50శాతం డిమాండ్‌ తగ్గిపోయిందన్నారు. కేవలం ఆహారం వస్తువులు, ధాన్యము, వైద్య ఉపకరణాలు మాత్రమే సరఫరా అవుతున్నాయని.. మిగతా రవాణా పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న మహారాష్ట్ర ఆటోమోటివ్‌ తయారీకి హబ్‌గా ఉందని.. ప్రస్తుతం వాటికి సంబంధించిన రవాణా పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తాజా ఆంక్షలతో ట్రక్కు డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మాదిరిగా టోల్‌, రోడ్డు పన్నుల నుంచి మినహాయింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:పరిశ్రమలకు ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం నిషేధం!

ABOUT THE AUTHOR

...view details