తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు.. కట్టుదిట్టంగా వారాంతపు​ కర్ఫ్యూ - రాత్రి కర్ఫ్యూ

Covid restrictions: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉత్తరాఖండ్​, గుజరాత్​, బంగాల్​ వంటి రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ.. కర్ణాటక, దిల్లీల్లో వారాంతపు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కొత్త ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి ఆయా రాష్ట్రాలు. అసోంలో జనవరి 30 వరకు పాఠశాలలు మూసివేశారు.

weekend curfew
రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు

By

Published : Jan 8, 2022, 1:14 PM IST

Updated : Jan 8, 2022, 2:30 PM IST

Covid restrictions: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కొత్త కేసులు లక్ష దాటాయి. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి చర్యలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాలు. ప్రజలు ఒక్కచోటికి చేరటం, రాజకీయ, సామాజిక, ఇతర కార్యక్రమాలను నిషేధిస్తున్నాయి. కట్టుదిట్టంగా రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ఓవైపు ఒమిక్రాన్​ కేసులూ గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు బాటపట్టాయి.

వాహనదారుల వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

రాజకీయ ర్యాలీలు, ఆందోళనలు నిషేధం

Covid restrictions in Uttarakhand: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది ఉత్తరాఖండ్​ రాష్ట్రం. జనవరి 16వ తేదీ వరకు రాజకీయ ర్యాలీలు, నిరసనల వంటి వాటిపై నిషేధం విధించింది. అలాగే.. పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాలను సైతం 16 వరకు మూసివేసింది. వీటితో పాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. మార్కెట్లు రాత్రి పది వరకు తీసి ఉండగా.. జిమ్ములు, షాపింగ్​ మాల్స్​, సినిమా హాళ్లు, ఆడిటోరియాలు, మైదానాలు వంటివి 50 శాతం సామర్థ్యంతో నడిపించాలని ఆదేశించింది. ఇతరులు రాష్ట్రంలోకి రావాలంటే వ్యాక్సిన్​ తీసుకోవటం లేదా 72 గంటలకు ముందు ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​ ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది.

జనవరి 30 వరకు పాఠశాలలు బంద్​

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది అసోం ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 5వ తరగతి వరకు పాఠశాలలను జనవరి 30 వరకు మూసివేసింది. అది గువాహటిలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల 8వ తరగతి వరకు సూళ్లు మూసివేయాలని స్పష్టం చేసింది. మరోవైపు..కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. కొత్త ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

100 మందికే అనుమతి..

Covid restrictions in Goa: గోవాలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ కట్టడికి కొత్త ఆంక్షలు ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​. ఎన్నికలు ఉన్న తీరప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో 100మంది మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇండోర్​ ప్రాంతాల్లో 50శాతం సామర్థ్యం సీటింగ్​ కెపాసిటీని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లు, ప్రజా, రాజకీయ సమావేశాలు, బీచుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు జనవరి 26వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

హైకోర్టులో వర్చువల్​గా విచారణ..

Night Curfew in Gujarat: గుజరాత్​లో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్న క్రమంలో వర్చువల్​ పద్ధతిలో కేసుల విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆన్​లైన్​ మోడ్​లోనే కేసుల విచారణ కొనసాగస్తామని పేర్కొంది.

వర్చువల్​ విచారణల్లోకి గుజరాత్​ హైకోర్టు

మరోవైపు.. కేసుల కట్టడికి శుక్రవారం రాత్రి కర్ఫ్యూ విధించింది గుజరాత్​ ప్రభుత్వం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహ్మదబాద్​, సూరత్​, వడోదరా, రాజ్​కోట్​, గాంధీనగర్​, జునాగఢ్​, జామ్​నగర్​, భవ్నాగర్​, ఆనంద్​, నడియాద్​ జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు ఉంటాయని తెలిపింది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలు, వివాహాలకు గరిష్ఠంగా 400 మంది, ఇండోర్​ ప్రాంతంలో 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతించింది.. అంత్యక్రియలకు కేవలం 100 మంది మాత్రమే హాజరవ్వాలని స్పష్టం చేసింది. దుకాణాలు, స్పా, షాపింగ్​ కాంప్లెక్సులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో 75 శాతం కెపాసిటీ, సినిమాహాళ్లు, జిమ్ములు, స్విమ్మింగ్​ పూల్స్​, గ్రంథాలయాలు, విద్యాసంస్థల్లో 50 శాతం సామర్థ్యంతో నడిపేందుకు అనుమతించింది. ఈ ఆదేశాలు జనవరి 31 వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

గుజరాత్​లో రాత్రి కర్ఫ్యూ దృశ్యాలు

కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూ..

Weekend curfew in Karnataka: కరోనా మహమ్మారి కట్టడికి కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఈ క్రమంలో బెంగళూరులో రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తూ అనవసరంగా బయటకి వచ్చినవారిపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు.

బెంగళూరులో వాహనాలు తనిఖీ చేస్తున్న సిబ్బంది
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

దిల్లీలోనూ వారాంతపు కర్ఫ్యూ..

Weekend curfew in Delhi: దేశ రాజధాని దిల్లీలో కరోనా కట్టడికి వారాంతపు కర్ఫ్యూ విధించింది కేజ్రీవాల్​ ప్రభుత్వం. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. జన్​పథ్​లోని దుకాణాలు మూసి వేశారు. ఆయా ప్రాంతాలు మనుషుల సంచారం లేక నిశబ్దంగా మారాయి.

దిల్లీ జన్​పథ్​ ప్రాంతంలో వారాంతపు కర్ఫ్యూతో మూతపడిన దుకాణాలు
వారాంతపు కర్ఫ్యూ కారణంగా మూతబడి దుకాణాలు

బంగాల్​లో ఆంక్షల సడలింపు..

కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలించింది బంగాల్​ ప్రభుత్వం. సెలూన్లు, పార్లర్లు రాత్రి 10 వరకు 50 శాతం సామర్థ్యంతో కొనసాగించేందుకు అనుమతించింది.

ఇదీ చూడండి:దేశంలో కరోనా విలయం.. ఒక్కరోజే 1.41లక్షల కేసులు

Last Updated : Jan 8, 2022, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details