తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 5:03 PM IST

ETV Bharat / bharat

గిరిజన ప్రాంతాలనూ చుట్టేస్తున్న కరోనా 2.0

ఒడిశాలో కొవిడ్​ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మల్కాన్​గిరిలోని గిరిజన ప్రాంతాలకూ వైరస్​ సెగ తాకింది. అక్కడ నివసించే బోండా తెగల్లో 12 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

Bonda tribe, Corona, Covid-19
బోండా తెగ, కరోనా, కొవిడ్​ొ

మల్కాన్​గిరిలో బోండా తెగలో కరోనా కలకలం

ఒడిశాలోని బోండా తెగ ప్రజలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు 12 మంది మహమ్మారి బారినపడ్డారు. మొదటి దశలో ఒక్క కేసూ నమోదుకాని మల్కాన్​గిరి గిరిజన ప్రాంతంలో.. రెండో విడతలో మాత్రం క్రమంగా బాధితుల సంఖ్య పెరగడం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

బోండా తెగ మహిళలు
టెస్టింగ్​ చేస్తున్న అధికారులు

దేశంలో దుర్బర జీవితాన్ని గడిపే గిరిజన తెగల్లో బోండా ఒకటి. సరైన ఆహార వసతి లేకపోవడం వల్ల.. వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన అధికారులు.. వైరస్​పై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్​గా తేలిన వారి ప్రైమరీ కాంటాక్ట్​ వ్యక్తులు నిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

ABOUT THE AUTHOR

...view details