తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నగరాల్లో ఆందోళనకరంగా కరోనా 'ఆర్​-వ్యాల్యూ' - Delhi Covid R-value

Covid R-value India: దేశంలో దిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన నగారాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దిల్లీ, ముంబయిలో వైరస్​ వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ 2 దాటినట్లు పేర్కొన్నారు. చెన్నై బెంగళూరు, కోల్​కతా నగరాల్లోనూ కొవిడ్​ వ్యాప్తి వేగం పుంజుకున్నట్లు తెలిపారు.

Covid R-value India
Covid R-value India

By

Published : Dec 30, 2021, 5:43 PM IST

Delhi Covid R-value: దిల్లీ, ముంబయి నగరాల్లో కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ(రీప్రొడక్షన్​​ నంబరు) 2 దాటిందని పరిశోధకులు తెలిపారు. చెన్నై, పుణె, బెంగళూరు, కోల్​కతాలో ఆర్​-వ్యాల్యూ ఒకటి దాటినట్లు చెన్నై ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన ఓ బృందం గుర్తించింది.

డిసెంబరు 23-29 మధ్య దిల్లీలో ఈ ఆర్ వ్యాల్యూ 2.54, డిసెంబరు 23-28 మధ్య ముంబయిలో 2.01 ఉన్నట్లు ఆ బృందానికి నేతృత్వం వహించిన సిదంబర సిన్హా పేర్కొన్నారు. ఈ రెండు నగరాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్-​వ్యాల్యూ చెన్నైలో 1.26, కోల్​కతాలో 1.13, పుణె, బెంగళూరు నగరాల్లో 1.11 చొప్పున ఉన్నట్లు వెల్లడించారు.

"అక్టోబరు మధ్య నాటికి అన్ని నగరాల్లో ఆర్​-వ్యాల్యూ 1గా ఉంది. అయితే ఒక్కసారిగా దిల్లీ ముంబయి నగరాల్లో అకస్మాత్తుగా కేసులు పెరిగాయి" అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పారు.

దిల్లీలో 1 శాతం దాటిన పాజిటివిటీ రేటు

దిల్లీలో రోజువారీ కొవిడ్​ కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 923 కేసులు నమోదయ్యాయి. 2021 మే 30 తర్వాత ఈ స్థాయిలో కొవిడ్​ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఆరు నెలల తర్వాత పాజిటివిటీ రేటు 1 శాతం దాటింది. డిసెంబరు 23-29 తేదీల మధ్య పాజిటివిటీ రేటు 0.19 నుంచి 1.29కు పెరిగింది.

ముంబయిలో కొవిడ్​ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 2,510 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదడవం ఇదే తొలిసారి.

ఆర్​-వ్యాల్యూ అంటే..

కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుందనే దానిపై ఆర్‌ వ్యాల్యూ ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందితే ఆ విలువ ఒకటిగా పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదీ చూడండి:ఒక్కరోజే 13 వేల కరోనా కేసులు.. ప్రజలకు ఆరోగ్య శాఖ వార్నింగ్!

ABOUT THE AUTHOR

...view details