దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 9.54 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. కొత్తగా 3,26,850 మంది కరోనా నుంచి కోలుకోగా దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 25,86,782కు చేరుకుందని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు.. 9.60 శాతమని తెలిపింది.
దేశంలో 9.54 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు - దేశంలో 9.54 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 9.54 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కొత్త కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొంది.
కరోనా పాజిటివిటీ రేటు
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
- దేశంలో మొత్తం కోలుకున్న వారు: 2,40,54,861
- మొత్తం పరీక్షలు: 33,25,94,176
- ప్రస్తుతం పాజిటివిటీ రేటు : 9.54 శాతం
- కొత్తగా నమోదైన కేసులు : 1,96,427
- మొత్తం అందించిన వ్యాక్సిన్ డోసులు : 19,85,38,999
- మొదటి డోసు తీసుకున్న వైద్య సిబ్బంది : 97,79,304
- రెండో డోసు తీసుకున్న వైద్య సిబ్బంది : 67,18,723
- టీకా తీసుకున్న 18-44ఏళ్ల వయసు వారు : 1,19,11,759
ఇదీ చదవండి :'వారిలో మూడో దశ వ్యాప్తిపై ఎలాంటి ఆధారాల్లేవ్'
TAGGED:
Covid positivity rate