తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. డీఎంకే ఎంపీ కనిమొళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె.. ప్రస్తుతం చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పీపీఈ కిట్ ధరించి, అంబులెన్స్‌లో మైలపూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కనిమొళి.
పీపీఈ కిట్ ధరించి.. ఓటు వేసిన ఎంపీ కనిమొళి - తమిళనాడు ఎన్నికలు
కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఎంపీ కనిమొళి.. చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చైన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పీపీఈ కిట్ ధరించి అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు.
ఎంపీ కనిమొళి
కరోనా రోగుల కోసం పోలింగ్ చివర గంట(సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు) సమయం కేటాయించింది ఎన్నికల సంఘం.
ఇదీ చూడండి:తమిళనాడు పోరు: ప్రశాంతంగా పోలింగ్