Containment Zone Covid Party: కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించమని అధికారులు హెచ్చరిస్తున్నా పలువురు వాటిని పెడచెవిన పెడుతున్నారు. కంటైన్మెంట్ జోన్లో ఓ రోగి నిబంధనలను ఉల్లంఘించి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఆదివారం జరిగింది.
పోలీసుల అదుపులో..
నీరాల నగర్‌లోని ఓ నివాసంలో ఇటీవల కొవిడ్ కేసును గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అయితే కొవిడ్ సోకిన యువకుడు అతని స్నేహితులతో కలిసి ఆ ఇంట్లో పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కొవిడ్ రోగి సహా అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి :పక్షవాతంతో బాధపడుతున్న కొడుకును చంపిన తండ్రి!