తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆక్సిజన్'​ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి - రాజస్థాన్​ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. గోమ్​తీ నగర్​లోని లోహియా ఆస్పత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. రాజస్థాన్​లో ఇదే తరహా ఘటన జరగ్గా.. అక్కడ ఓ మహిళ మృతిచెందారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Lohia Hospital, Gomti Nager
లోహియా ఆస్పత్రి, ఉత్తర్​ప్రదేశ్​

By

Published : Apr 17, 2021, 5:18 PM IST

Updated : Apr 17, 2021, 5:40 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్​ కేసులు పెరుగుతున్నందున.. గోమ్​తీ నగర్​లోని డాక్టర్​ రామ్​ మనోహర్​ లోహియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్(డీఆర్​ఎంఎల్ఐఎంఎస్)ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అక్కడ పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోగా.. మిగతావారికి స్ట్రెచర్​పైనే ఆక్సిజన్​ అమర్చారు వైద్యులు. అయితే.. శనివారం ఉదయం 6 గంటలకు ఆస్పత్రి బ్లాక్​లో ఆక్సిజన్​ పూర్తిగా అయిపోయింది. ఈ కారణంగా.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు కొవిడ్​ బాధితులు మరణించారు.

సరఫరా సక్రమంగా లేనందునే..

లోహియా ఆస్పత్రిలో.. గతంలో రోజుకు 40-45 సిలిండర్లు ఉపయోగించేవారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున.. ప్రస్తుతం రోజుకు సగటున 150 ఆక్సిజన్​ సిలిండర్లు అవసరమవుతున్నాయి. పలు కారణాల వల్ల శుక్రవారం సిలిండర్ల సరఫరా సక్రమంగా లేనందున ఈ పరిస్థితి తలెత్తింది.

ఇదీ చదవండి:'కరోనాపై పోరుకు కేంద్రం సంసిద్ధంగా లేదు'

రాజస్థాన్​లోనూ ఇదే తరహాలో..

రాజస్థాన్​లో గురువారం జరిగిన ఇదే తరహా ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరోహికి చెందిన ఓ మహిళ ఇటీవల కరోనా బారినపడి పాళీలోని బంగర్​ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినందున.. ఆక్సిజన్ అవసరమైంది. అక్కడి వైద్యులు ప్రాణవాయువు​ సరఫరా ఇవ్వకపోవడం వల్ల.. ఆమె స్ట్రెచర్​పైనే మరణించారు. ఆక్సిజన్​ కొరత కారణంగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:భారత్​లో ఈ టీకాలకు అత్యవసర అనుమతి లభించేనా?

Last Updated : Apr 17, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details